Supreme Court: కంప్యూటర్ కొనుక్కోలేరా?!
న్యాయవాదిని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ధర్మాసనం
ఢిల్లి (CLiC2NEWS): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ, జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ హిమా కొహ్లీలతో కూడిన ధర్మాసనం సోమవారం పలు కేసుల్ని విచారించింది. ఆన్‌లైన్ విచారణలో న్యాయవాదులు ఆడియో, వీడియో క్లారిటి లేని మొబైల్ ఫోన్లను వినియోగించడం వలన ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు అసహనానికి గురై దాదాపు పది కేసులు వరకు వాయిదా వేశారు.
దేశంలో కరోనా విజృంభణ కారణంగా సుప్రీంకోర్టు వీడియో కార్ఫరెన్స్ ద్వారా కేసులను విచారిస్తున్నది. ఈ నేపథ్యంలో కొందరు న్యాయవాదులు మొబైల్ ఫోన్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఫోన్లో సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో న్యాయమూర్తులు గట్టిగా అరిచి చెప్పాల్సి వచ్చింది. ఈ సందర్భంలో ‘ లాయర్‌గారూ.. మీరు తరచూ సుప్రీంకోర్టులో కేసు విచారణలో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటున్నారు. ఒక కంప్యూటర్ కొనుక్కోలేరా’ అని ధర్మాసనం ప్రశ్నించింది.