Delhi: 24 గంటల్లోగా కాలుష్య నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలి: సుప్రీం కోర్టు
మూడు, నాలుగేళ్ల పిల్లలుల పాఠశాలలకు వెళ్తంటే.. పెద్దలు ఇంటి నుంచి పని చేస్తున్నారు

ఢిల్లి (CLiC2NEWS): కాలుష్యం అంశంపై గత నాలుగు రోజులనుండి వరుసగా సుప్రీం కోర్టు విచారణ చేపడుతోంది. ప్రభుత్వ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ ఢిల్లీలో కాలుష్యం పెరుగతూనే ఉందని, సమయం వృథా అవుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలు, వాహనాల నుండి వచ్చే కాలుష్య నివారణ చర్యలు వెంటనే చేపట్టాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
‘మూడు, నాలుగు సంవత్సారాల వయస్సు పిల్లలుల పాఠశాలలకు వెళ్తంటే.. పెద్దలు ఇంటి నుంచి పని చేస్తున్నారు’ అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని గాలి కాలుష్యం కారంణంగా పాఠశాలలకు పది రోజులు సెలవులు ప్రకటించారు. సెలవుల అనంతరం సోమవారం నుండి పాఠశాలలను తిరిగి ప్రారంభించిన నేపథ్యంలో.. పిల్లలు సరిగ్గా నేర్చుకోలేకపోతున్నారని, సుదీర్ఘ చర్చల అనంతరం పాఠశాలలు ప్రారంభించినట్లు ఢిల్లీ ప్రభుత్వ వెల్లడించింది. ‘ఆన్‌లైన్ బోధనను మీరు ఆప్షన్’కు వదిలేశారు. కరోనా మహమ్మరి వలన పిల్లలకు ఎదురవుతున్న సమస్యలను అందరం చూస్తూనే ఉన్నం. మీరు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే.. మేం కఠిన చర్యలు తీసుకుంటాం. మీకు 24 గంటల సమయం ఇస్తున్నాం అంటూ ప్రధాన న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు.