Supreme Court: భరణంగా ‘బిఎండబ్ల్యూ’ డిమాండ్..
ఢిల్లీ (CLiC2NEWS): భర్త నుండి విడాకులు కోరుతున్న మహిళ.. బిఎండబ్ల్యు కారు కావాలని అడగడంతో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భర్త నుండి విడాకులు కావాలని కోరుతున్న మహిళ తన భర్త నుండి రూ.12 కోట్లు , ముంబయిలో ఇల్లు, బిఎండబ్ల్యు కారు కావాలని అడిగింది. ఈ కేసును విచారిస్తున్న సిజెఐ జస్టిస్ గవాయ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదివి, సొంతంగా సంపాదించుకునే సామర్ద్యం ఉండి కూడా ఇలా అడగడం సరికాదని సిజెఐ సదరు మహిళకు సూచించారు. ఉద్యోగం చేసి సంపాదించుకోవచ్చుకదా అని అడిగారు.
అయినా వివాహం జరిగి 18 నెలలు మాత్రమే అయ్యిందని.. అపుడే విడాకులు తీసుకునే వారు బిఎండబ్ల్యు కారు కోరడమేంటని సిజెఐ ప్రశ్నించారు.
సదరు మహిళ.. భర్త ఉద్యోగాన్ని వదులుకోవాలని సూచించడంతో తాను గతంలో ఉద్యోగం మానేశని వెల్లడించింది. తన భర్త ధనవంతుడని, తాను మానసిక సమస్యలతో భాద పడుతుండటంతో తన భర్త విడాకులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్లు సదరు మహిళ తెలిపింది. తన వైద్యం కోసం ఖర్యు ఎక్కువవుతుందని .. ఆ కారణంతో భరణం ఎక్కువ అడుగుతున్నట్లు న్యాయస్థానానికి వివరించింది. తన భర్త బిడ్డను కూడా తనకు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
వాదనలు విన్న సిజెఐ .. భర్త నుండి భరణంగా ముంబయిలో ఇల్లు, రూ.4కోట్ల నగదు ఇప్పిస్తామని, బెంగళూరు, హైదరాబాద్ , పుణె వంటి నగరాల్లో ఐటి ఉద్యోగం చేసుకోవాలని సదరు మహిళకు సూచించారు. కేసుపై ఆర్డర్ ను రిజర్వ్ చేశారు.