ఎస్సీ, ఎస్టీ రిజ‌ర్వేష‌న్ల వ‌ర్గీక‌ర‌ణ‌కు `సుప్రీం` గ్రీన్ సిగ్న‌ల్‌

ఉప వ‌ర్గీక‌ర‌ణ‌ను రాష్ట్రాలు చేయొచ్చ‌ని కీల‌క తీర్పు

న్యూఢిల్లీ (CLiC2NEWS): ఎస్సీ, ఎస్టీల రిజ‌ర్వేష‌న్ల‌పై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం కీల‌క తీర్పును వెల్ల‌డించింది. గురువారం ఏడుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం చారిత్రాత్మ‌క తీర్పును వెలువ‌రించింది. విద్యాసంస్థ‌ల్లో ప్ర‌వేశాలు, స‌ర్కార్ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీల‌కు కేటాయించిన రిజ‌ర్వేష‌న్ల‌ను ఉప వ‌ర్గీక‌ర‌ణ చేసే అధికారం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఉంటుంద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది.

చీఫ్ జ‌స్టిస్ డి.వై. చంద్ర‌చూడ్ నేతృత్వంలోని ఏడుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం 6.1 మెజారిటితో నేడు తీర్పును వెలువ‌రించింది. 2004 సంవ‌త్స‌రంలో ఐదుగురు స‌భ్యులు ఇచ్చిన తీర్పును తాజాగా విస్తృత ద‌ర్మాస‌నం ప‌క్క‌న‌బెట్టింది. తాజా తీర్పును అనుస‌రించి ప్ర‌భుత్వాలు త‌దుప‌రి మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందించుకోవాల‌ని కోర్టు సూచించింది.

“ఒక కులంలో ఉప‌వ‌ర్గాలు చేసేందుకు రాజ్యాంగంలోని 14వ అధిక‌ర‌ణ తెలియ‌జేస్తుంది. అందుకే 2004 సంవ‌త్స‌రం నాటి ఇవి చిన్న‌య్య తీర్పును మేం వ్య‌తిరేకిస్తున్నాం. రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఉప వ‌ర్గీక‌ర‌ణ చేసేందుకు అనుమ‌తి క‌ల్పిస్తున్నాం.“ అని సిజెఐ ద‌ర్మాస‌నం స్పష్టం చేసింది. ఏడుగురు జ‌డ్జిల ధ‌ర్మాస‌నంలో ఆరుగురు న్యాయ‌మూర్తులు అనుకూలంగా.. ఒక న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బేలా త్రివేది మాత్రం ఉప వ‌ర్గీక‌ర‌ణ సాధ్యంకాదంటూ వ్య‌తిరేకించారు.

Leave A Reply

Your email address will not be published.