ఎంపి విజయసాయిరెడ్డికి సుప్రీం నోటీసులు..

ఢిల్లీ (CLiC2NEWS): ఎపి సిఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో వైఎస్ ఆర్ పార్టీ పార్టమెంటరీ నేత విజయసాయి రెడ్డికి ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. గతంలో తెలంగాణ హైకోర్టు సిబిఐ కేసుల విచారణ తేలేవరకు ఇడి కేసుల విచారణ ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన దేవ సర్వోన్నత న్యాయస్థానం.. ప్రతివాదులుగా ఉన్న విజయసాయిరెడ్డి, భారతీ సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్కు సెప్టెంబర్ 5 వ తేదీలోగా సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేసింది.
సిబిఐ, ఇడి కేసుల విచారణ సమాంతరంగా కొనసాగించవచ్చని గతంలో హైదరాబాద్‌లోని సిబిఐ కోర్టు తీర్పునిచ్చింది. అయితే తెలంగాణ హైకోర్టు సిబిఐ ఛార్జి షీట్లపై తీర్పు వెలువడిన తర్వాతే ఇడి కేసుల విచారణ చేపట్టాలని 2021లొ తీర్పునిచ్చింది. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా జప్తు చేసిన భారతి ఆస్తుల విడుదలకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇడి సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసు విచారణ జులై 14వ తేదీన జరగనుంది.