Suravaram Sudhakar Reddy: `సుర‌వ‌రం` క‌న్నుమూత‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): సిపిఐ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డి (83) ఇక లేరు. గ‌చ్చి బౌలి లోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ శుక్ర‌వారం రాత్రి క‌న్నుమూశారు. హైద‌రాబాద్‌లోని మ‌ణికొండ‌లో నివాస‌ముంటున్న ఆయ‌న ఊపిరి తీసుకోవ‌డంలో ఇబ్బందులు త‌లెత్త‌డంతో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స‌పొందుతూ సుర‌వ‌రం క‌న్నుముశారు. ఆయ‌న‌కు భార్య డాక్టర్ బివి విజ‌య‌ల‌క్ష్మి, ఇద్ద‌రు కుమారులు నిఖిల్‌, క‌పిల్ ఉన్నారు.

సుధాక‌ర్ రెడ్డి స్వ‌గ్రామం జోగులాంబ గ‌ద్వాల జిల్లా ఉండ‌వ‌ల్లి మండ‌లం కంచుపాడు. ఆయ‌న త‌న అమ్మ‌గారి గ్రామంర్థి కోడేరు మండ‌లం కొండారావుప‌ల్లిలో మార్చి 25 తేదీ 1942న జ‌న్మించారు.

ఆయ‌న విద్యార్థి ద‌శ‌లోనే బ్లాక్ బోర్డులు, పుస్త‌కాలు కావాలంటూ ఆందోళ‌న‌లు జ‌రిపారు. చిన్న‌నాటి నుంచే సుర‌వ‌రం క‌మ్యూనిస్టు భావ‌జాలానికి ఆక‌ర్శితుల‌య్యారు. విద్యార్థి ఉద్య‌మాల నుంచి ఎదిగిన ఆయ‌న మూడు సార్లు సిపిఐ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశారు. తెలంగాణ ఉద్య‌మంలో సుర‌వ‌రం కీల‌క పాత్ర పోషించారు.

Also Read: Telangana: వైద్య‌శాఖ‌లో 1,623 పోస్టులు

1 Comment
Leave A Reply

Your email address will not be published.