సూర్యాపేట: ఇంటిగోడ కూలి ముగ్గురు మృతి

సూర్యాపేట (CLiC2NEWS): జిల్లాలోని నాగారంలో ఓ ఇంటి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన‌ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు ఇంటి గోడ‌లు మెత్త‌బడి గోడ కూలిపోయింది. ఆ ఇంట్లో నిద్రిస్తున్న రాములు, రాములమ్మ, కుమారుడు శ్రీ‌నివాస్‌ల‌పై ప‌డిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యుతాత ప‌డ్డారు. దీంతో ఆ గ్రామంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. మ‌ర‌ణించిన శ్రీ‌నివాస్‌కు భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.