బిహార్‌లో 16 మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు

పట్నా (CLiC2NEWS): బిహార్‌లో ఇటీవల వరుసగా బ్రిడ్జ్‌లు కూలిపోతున్న విషయం తెలిసిందే . 17 రోజుల వ్వవధిలో 12 వంతెనలు కూలిపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేపథ్యంలో 16 మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు పడింది. రాష్ట్ర జలవనరుల శాఖకు చెందిన 16 మంది ఇంజినీర్లను సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వంతెనల నిర్మాణానికి బాధ్యులైన కాంట్రాక్టర్లను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని బిహార్ అభివృద్ధి కార్యదర్శి
చైతన్య ప్రసాద్ తెలిపారు. ఈ విషయంపై రాష్ట్ర సిఎం నితీష్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం రాష్ట్రంలోని పాత వంతెనలకు తక్షణమే మరమ్మతులు చేయాలని ఆదేశించారు.