అనంతపురం, పల్నాడు ఎస్పిలపై సస్పెన్షన్ వేటు.. ఇసి
ఢిల్లీ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అనంతరం చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సిఎస్ జవహర్ రెడ్డి, డిజిపితో భేటి అయిన అనంతరం మూడు జిల్లాలకు చెందిన కీలక ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్లను సస్పెన్షన్ చేసి.. వారిని విధుల్లోంచి తొలగించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అంతేకాక పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పిలను బదలీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకోవాని సిఎస్, డిజిపిలను ఆదేశించింది.
పోలింగ్ జరిగిన రోజున పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో హింస చెలరేగిందని, దీన్ని నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారని ఇసి తెలిపింది. సిఎస్ , డిజిపితో గురువారం కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు కమిషనర్లు భేటీ అయ్యారు. మూడు జిల్లాల్లో మొత్తం 12 మంది సబార్డినేట్ పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇకపై ఎలాంటి హింస చెలరేగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరాఆవృతమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది.