ఇద్ద‌రు అట‌వీశాఖ అధికారుల‌పై స‌స్పెన్ష‌న్ వేటు!

ఆమ‌న‌గ‌ల్లు (CLiC2NEWS): దొంగ‌ల‌కు స‌హ‌క‌రించారని ఇద్ద‌రు అట‌వీశాఖ అధికారుల‌ను సస్పెండ్ చేశారు. జ‌రిగిన విష‌యాన్ని ఉన్న‌తాధికారుల‌కు స‌మాచారం అందివ్వ‌క‌పోవ‌డంతో ఎఫ్ ఆర్ ఒ , క‌డ్తాల్ డిప్యూటి ఎఫ్ ఆర్ ఒను స‌స్సెండ్ చేసిన‌ట్లు స‌మాచారం. రంగా రెడ్డి జిల్లా మైసిగండి శివారులో ఏర్పాటైన స్టోన్ క్ర‌షింగ్ కంక‌ర మిష‌న్ విష‌యంలో అట‌వీశాఖ అధికార‌లు అభ్యంత‌రం తెల‌ప‌డ‌తో స్థ‌ల వివాదం ఏర్ప‌డింది. 2006లో హైకోర్టు క్ర‌షింగ్ యూనిట్ నిలిపివేయాల‌ని ఆదేశించింది. మిష‌న్ సంర‌క్ష‌ణ బాధ్య‌త‌ల‌ను అట‌వీశాఖ‌కు అప్ప‌గించింది. ఆ మిష‌న్ కొందరు దుండ‌గులు ముక్క‌లు చేసి విక్ర‌యించినట్లు స‌మాచారం. విష‌యం తెలుసుకున్న పోలీసులు లారీలో త‌ర‌లిస్తున్న స‌రుకును ప‌ట్టుకున్నారు. అయితే చోరీకి ఎఫ్ ఆర్ ఒ స‌హ‌క‌రించార‌ని.. దీనికి వారు రూ. 8 ల‌క్ష‌లు లంచం తీసుకున్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ముగ్గురు నిందితుల‌తో పాటు ఎఫ్ ఆర్ ఒపై కూడా కేసు న‌మోదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.