బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థి అనుమానాస్పద మృతి..

బాసర (CLiC2NEWS): బాసర ఆర్‌జియుకెటిలో ఇంజనీరింగ్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి వసతి గృహంలో మృతి చెందాడు. మంగళవారం మధ్యాహ్నం అతని స్నేహితులు గదికి వెళ్లే సరికి లోపలి నుండి తాళం వేసి ఉంది. అనుమానంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా.. విద్యార్థి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థి అత్మహత్యపై పోలీసులు విచారణ చేపట్టారు. వ్యక్తిగత కారణాలతోనే విద్యార్థి అత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. పూర్తి వివరాలు పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత వెల్లడిస్తామన్నారు.