కనులపండుగగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం
Srivari Swarna Rathodsavam as Kanula Panduga

తిరుమల(CLiC2NEWS): తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ఫ స్వామివారు బంగారు రథంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని పలు ప్రముఖుల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ దంపతులు శ్రీవేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో స్వర్ణ రథోత్సవం లో పాల్గొన్నారు.