స్విస్ ఓపెన్ టైటిల్ విజేత పివి సింధు

స్విస్ ఓపెన్ సూపర్ 300 బాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పిపి సింధు థాయ్‌లాండ్ క్రీడాకారిణిపై విజయం సాధించింది. స్విస్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్‌లో 21-16,21-8 తేడాతో వరుస సెట్లలో థాయ్‌లాండ్ షట్లర్ బుసానన్‌పై సింధు విజయం సాధించింది. కేవలం 49 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో సింధు 21-18,15-21,21-19 తేడాతో సుపానిదా (థాయ్‌లాండ్) పై విజయం సాధించింది.