నరాల వీక్నెస్ ల‌క్ష‌ణాలు.. నివార‌ణ చిట్కాలు..

ఇదొక రకమైన వ్యాధి.. చాలా మంది చాలా బలంగా, అందంగా, ఒడ్డు పొడువుగా ఉన్నట్లుగా బాహ్యంగా చూడటానికి కనపడతారు. కానీ లోపల తమపై తమకి విశ్వాసం లేని వారు కూడా ఎందరో వుంటారు. మనం అలాంటి వారిని చూస్తూ ఉంటాము. వీరు స్వయంగా ఏదైనా పని చేయాలనుకుంటే వీరు స్వయంగా నిర్ణయము తీసుకోలేరు. వీరికి ఏకాగ్రత తక్కువగా ఉంటుంది. వీరి బుర్రలో ఎన్నో అనుమానాలు.. సందేహాలు.. ఆందోళనతో కూడి ఉంటుంది. ఇదే వ్యాధి లక్షణం,..

ఈ వ్యాధి వచ్చిన వారు బయటికి బాగానే హుందాగా కనపడతారు. వ్యాధి లేనివాడిగా బయటి వారికి కనపడతారు. కానీ రోగిని లోలోపల రోగం విరుచుకొని తింటుంది. శారీరకంగా,మానసికంగా రోగి బాధపడుతుంటాడు.

వీరు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రాగానే మందులు వాడటం. పెయిన్ కిల్లర్స్ వేసుకోవటం, కామ, మద,మోహ వాసనాలతో కూడి ఉండటం, వ్యతిరేక ఆహార పదార్దాలు, పిజ్జా, స్నాక్స్, ఎక్కువగా తినటం, రాత్రి సరిగ్గా నిద్రపోకపోవటం, ఇవన్నీ నరాల బలహీనత రోగానికి సంబంధించిన కారణాలు.

రోగ లక్షణాలు.

1 ప్రతి విషయానికి కోపం రావటం, చిరాకు,చిదరించుకోవటం,

2. చిన్న చిన్న విషయాలు, సంగతులకు కూడా గొడవపడటం,కొట్టుకోవటం, లాంటివి చేయటం.

3. ఈ రోగి తనకు తాను ఒకొక్కసారి నేను బలహీనుడిగా వున్నా అని మనసులో భావాలు రావటం.

4. ఈ వ్యాధిగ్రస్థులు చిన్న విషయానికి, చిన్న మాటకు కూడా డిప్రెషన్ లో పడిపోవటం, మానసిక ధైర్యం కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడటం,

చికిత్స

1. రోగికి సరైన చికిత్స చేయించాలి. చక్కని ఆయుర్వేద మందులు వాడాలి.

2. రోగికి గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. అవసరమైతే ముందుగా వేడి నీటితో, తరువాత చల్లని నీటితో స్నానం చేయించాలి.
3. రోగికి ఉదయం సాయంత్రం, వాకింగ్, లేదా యోగ, చేయించాలి. మంచి సంగీతం వినిపించాలి.

4. రోగికి వీపు మీద, చల్లని, వేడిని నీటితో కాపు పెట్టాలి. పొట్ట మీద చల్లని పట్టి వేయాలి.

5. రోగి స్నానం చేసేటపుడు శరీరం అంత బాగా రుద్దాలి. స్నానానికి అర గంట ముందు నువ్వుల నూనే తో బాడీ మసాజ్ చేయాలి.
6. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శవాసనం 15 నిముషాలు వేయాలి.

7. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు, తీసుకోవాలి.

యోగ చికిత్స..

1, యోగ ఉదయం, సాయంత్రం గంట గంట చేయాలి. శరీరం నుండి చమట బయటికి రావాలి.

2. ప్రాణాయామం, మరియు యోగలో వజ్రాసనం, భుజాంగాసనం, మకరాసనం,శలాభాసనం, పవనముక్తాసనం, పశ్చిమోత్తాసనం చేయాలి.

3. కపాలభాతి, నాడి శోధన, బ్రామరి ప్రాణాయమం చేయాలి.

 

ఆహారనియమాలు

1. రోగి సమయానికి ఆహారం తినాలి.

2. రోగి తేలికగా జిర్ణం అయ్యే ఆహారం తినాలి.

3, క్షార పదార్దాలతో కూడుకున్న ఆహారం తినాలి. భోజనంలో సోడియం, ఫోస్పోరస్ విటమిన్లు ఉండేలా చూసుకోవాలి, కాలానికి బట్టి వచ్చే పండ్లు తినాలి.

4. నరాల వీక్నెస్ ఉంటే బాదాం, కిస్ మిస్, అంజీర, ద్రాక్ష, జామకాయ, తినాలి..

5. కాకరకాయ, బీరకాయ, పాలకూర, మెంతికూర, కీరాదోసకాయ, క్యారెట్, ముల్లంగి, టమాటా, తినాలి.

6. మొలకెత్తిన విత్తనాలు, శనగలు, పెసలు, పాలు తీసుకోవాలి.

7. రాత్రి నిదురించే ముందు, ఉసిరికాయ చూర్ణం, తేనే కలిపి తీసుకోవాలి. దీనితో ఆహారం త్వరగా అరుగుతుంది. శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది.

-షేక్.బహర్ అలీ

ఆయుర్వేద వైద్యుడు,

సెల్ 7396126557

Leave A Reply

Your email address will not be published.