ఐర్లాండ్‌పై భారత్ విజయం

T20 World Cup: టి20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భారత్ శుభారంభం చేసింది. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
97 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 96 పరుగులకే ఆలౌటైంది. అనంతరం భారత్ బ్యాటర్లు 12.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. రోహిత్ శర్మ (52) అర్ధశతకంతో రాణించాడు.