టి20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
పాకిస్థాన్‌తోనే ఇండియా తొలి మ్యాచ్.. వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల
![](https://clic2news.com/wp-content/uploads/2021/08/indo-pak.jpg)
దుబాయ్ (CLiC2NEWS): ఐసిసి టి20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను మంగళవారం ఐసీసీ రిలీజ్ చేసింది. ఒమన్‌తో పాటు యుఎఇలో టి20 ప్రపంచకప్ నిర్వహించనున్నారు. నవంబర్ 10,11 తేదీల్లో సెమీఫైనల్.. నవంబర్ 14న ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
టీమిండియా తన తొలి మ్యాచ్‌ను దాయాది పాకిస్థాన్‌తోనే ఆడబోతోంది. అక్టోబర్ 24న ఈ మ్యాచ్ దుబాయ్‌లో జరగనుంది. ఇక రౌండ్ 1లో గ్రూప్ బిలోని ఒమన్, పపువా న్యూ గినియా మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. అక్టోబర్ 17న ఈ మ్యాచ్ జరుగుతుంది. అదే రోజు స్కాట్లాండ్, బంగ్లాదేశ్ మరో మ్యాచ్‌లో తలపడనున్నాయి.
టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌లను అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న ఆఫ్ఘనిస్థాన్‌తో, నవంబర్ 5న గ్రూప్ బిలో టాప్ పొజిషన్లో నిలిచిన టీమ్, నవంబర్ 8న గ్రూప్ ఎలో రెండో స్థానంలో నిలిచిన టీమ్‌తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకే ప్రారంభమవుతాయి.