తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో 200 మంది క్రీడాకారులకు బెల్టులు అంద‌జేత‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలోని గాంధీనగర్ జిహెచ్ఎంసి ప్లే గ్రౌండ్ లో ఆదివారం తైక్వాండో మార్ష‌ల్ ఆర్ట్స్ క్రీడాకారుల‌కు బెల్టులు, స‌ర్టిఫికేట్లను అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మం తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్, తైక్వాండో మార్షల్ ఆర్ట్ , మార్షల్, జైన్ సెక్రటరీ, మాస్టర్ బి . కృష్ణ ఆధ్వర్యంలో  నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  గ్రాండ్ మాస్టర్ వెంకటేశం హాజ‌ర‌య్యారు. ప్ర‌తిభ చూపిన‌ క్రీడాకారుల‌కు బెల్ట్స్‌, గ్రీటింగ్స్, బ్లాక్ బెల్ట్ , సర్టిఫికెట్స్ అంద‌జేశారు. ఈ వేడుక‌లో దాదాపు 200 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాలొ్న్నారు. ప‌లువురు క్రీడాకారులు వారి నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా బెల్ట్స్‌, సర్టిఫికెట్ పొందిన క్రీడాకారుల‌ను హైదరాబాద్ డిస్ట్రిక్ట్ తైక్వాండో సెక్రెట‌రి పి. సుబ్రహ్మణ్యం అభినందించారు.

ఈ సందర్భంగా మాస్టర్ కృష్ణ,మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు మార్షల్ ఆర్ట్స్ లో శిక్ష‌ణ పొందితే ఆత్మ‌రక్షణ కొరకు ఉపయోగపడుతుందని తెలిపారు. ముఖ్యంగా మహిళలు శిక్షణ తీసుకుంటే వారి ఆత్మ రక్షణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయ‌న పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎగ్జామినర్ సంజయ్ సింగ్, కోచ్ లు కార్తీ, మనీష్, రఘు స్వామి, సిద్దు, హరిణి , వెంకట్ భాస్కర్ , క్రితిక్, ప‌లువురు క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.