తెలంగాణ మంత్రులుగా ప్రమాణ స్వీకారం..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో కొత్త సర్కార్ కొలువుదీరింది. ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సిఎం, మంత్రులు ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. తర్వాత డిప్యూటీ సిఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులుగా దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, సీతక్క, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు ప్రమాణం చేశారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర అగ్ర నేతలు, భారీ సంఖ్యలో అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియం ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది.












డిప్యూటీ సిఎంగా ప్రమాణం చేస్తున్న మల్లు భట్టి విక్రమార్క