జాతీయ జెండాలతో నిరసన చేస్తున్న వారిపై తాలిబాన్ల కాల్పులు

కాబూల్ (CLiC2NEWS): అఫ్ఘనిస్థాన్ కునార్ ప్రావిన్స్ లోని అసదాబాద్ లో దారుణం జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవ ర్యాలీలో జాతీయ పతాకంతో నిరసన తెలుపుతున్న వారిపై తాలిబన్లు కాల్పులు జరిపారు.కాల్పుల భయంతో వందలాది మంది ఒక్కసారిగా పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. అసాదాబాద్ నగరంలో గురువారం ఈ ఘోర ఘటన జరిగింది. బుధవారం జలాలాబాద్లోనూ జాతీయ జెండా విషయంలో నిరసన తెలపగా.. తాలిబన్ల కాల్పుల్లో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే.