తమిళ హీరో ధనుష్, ఐశ్వర్య విడాకులు!
చెన్నై (CLiC2NEWS): సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, తమిళ హీరో ధనుష్ దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించారు. తమ 18 యేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు వీరిద్దరు సోమవారం ట్విట్టర్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు.
“పద్దెనిమిది సంవత్సరాల పాటు స్నేహితులుగా, భార్యభర్తలుగా, తల్లిదండ్రులుగా ఉన్నాం. మా ప్రయాణం పరస్పర అవగాహన, సర్దుబాటుతో సాగింది. ఇక మేము వేరే దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాం. మా నిర్ణయాన్ని దయచేసి గౌరవించండి. మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని కోరుతున్నాం. ఓం నమఃశివాయ“
అని హీరో ధనుష్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
ఐశ్వర్యకూడా అదే లేఖను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
OM NAMASHIVAAYA 🙏🙏🙏 pic.twitter.com/XXFo8BDRIO
— Dhanush (@dhanushkraja) March 23, 2021