‘తండేల్’ రిలీజ్ డేట్ ఫిక్స్

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా తెర‌కెక్కుతున్న చిత్రం ‘తండేల్’. తాజాగా చిత్ర బృందం సినిమా రిలీజ్ డేట్‌పై క్లారిటి ఇచ్చింది. ఫిబ్ర‌వ‌రి 7వ తేదీన ఈ చిత్రం విడుద‌ల చేయునున్న‌ట్లు తెలిపింది. నిర్మాత అల్లు అర‌వింద్ మాట్లాడుతూ.. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి ఇద్ద‌రికీ అవార్డులు వ‌స్తాయ‌న్నారు. సాయి ప‌ల్ల‌వి త‌న‌కు కుమార్తెతో స‌మాన‌మ‌న్నారు. అమ‌ర‌న్ చిత్రం చూసి ఎమోష‌న‌ల్ అయ్యార‌ని, ప‌ల్ల‌వికి ఫోన్ చేసి అభినందించిన‌ట్లు తెలిపారు. ఈ సినిమా షూటింగ్‌కు చాలా ప‌ర్మిష‌న్లు అవ‌స‌ర‌మ‌య్యాయని, క్వాలిటి విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌లేద‌ని బ‌న్నీ వాసు తెలిపారు. ఈ చిత్రం రూ.100కోట్ల క్ల‌బ్‌లో చేరుతుంద‌న్నారు.

తండేల్ రియ‌ల్ లైఫ్ స్టోరీ.. తెలుగు ప్రేక్ష‌కులంద‌రికీ థ్యాంక్స్ అంటూ సాయిప‌ల్ల‌వి మాట్లాడారు. న‌న్ను అల్లు అర‌వింద్ గారు కుమార్తెగా భావిస్తార‌ని..సినిమా విడుద‌ల విష‌యంలో నిర్మాత‌లు ఎపుడూ ఒత్తిడి చేయ‌లేద‌న్నారు. నాగ చైత‌న్య ఏడాది నుండి ఈ ప్రాజెక్టులో ఉన్నార‌ని, మ‌రో ప్రాజెక్టు గురించి ఆలోచించ‌లేద‌ని తెలిపారు. నాగ‌చైత‌న్య మాట్లాడుతూ.. తండేల్ గొప్ప చిత్ర మ‌ని.. శ్రీ‌కాకుళంలో కొంద‌రు మ‌త్స్య‌కారుల జీవిత‌మ‌న్నారు. ఈ చిత్రం ఎపుడు రిలీజ్ చేసినా పండ‌గే అవుతుంద‌న్నారు.  సాయిప‌ల్ల‌వితో డాన్స్ చేయ‌డం క‌ష్ట‌మ‌ని, ఆమె క్వీన్ ఆఫ్ బాక్సాఫీస్ అని ప్ర‌శంసించారు.

Leave A Reply

Your email address will not be published.