తారకరత్న కన్నుమూత

హైదరాబాద్ (CLiC2NEWS): నటుడు నందమూరి తారకరత్న కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుతో బెంగళూరు ఆసుపత్రిలో ఆయన గత 23 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. గత నెల (జనవరి) 27 వ తేదీన నారా లోకేశ్ నిర్వహించిన `యువగళం` పాదయాత్రలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నప్పుడు తారకరత్న తీవ్ర అస్వస్థతకు గుండెపోటు రావడంతో తొలుత కుప్పం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయకు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న రాత్రి తారక రత్న మరణించారు.
తారకరత్న మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
1983 ఫిబ్రవరి 22న జన్మించిన తారకరత్నకు భార్య అలేఖ్యరెడ్డి, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 20యేళ్ల వయసులోనే 2001వ సంవత్సరంలో `ఒకటో నెంబర్ కుర్రాడు` సినిమాతో నటుడిగా కేరిర్ ప్రారంభించారు. మొత్తం 23 సినిమాలు, పలు వెబ్ సిరీస్‌లలో నటించారు.