AP: టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థులు..

అమరావతి (CLiC2NEWS): ఎపిలో తెలుగుదేశం పార్టి ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. సిఎం చంద్రబాబు నాయుడు మూడు స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు. కావలి గ్రీష్మ (ఎస్‌సి), బీద రవిచంద్ర (బిసి), బిటి నాయుడు (బిసి) కు అవకాశం కల్పించారు. సోమవారంతో నామినేషన్ గడువు ముగియనుంది. ఎమ్మెల్యే కోటాలో మొత్తం ఐదు స్థానాలకు ఎన్నిక జరగనుండగా.. ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించారు. జనసేన తరపున కొణిదెల నాగబాబు ఇప్పటికే నామినేషన్ సమర్పించారు. అనంతరం ఒక స్థానం బిజెపి కేటాయించాలని ఆ పార్టి పెద్దలు ముందుకొచ్చారు. దీంతో బిజెపికి ఒక స్థానం కేటాయించాలని టిడిపి నిర్ణయించింది. మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.