చంద్రబాబు నివాసంలో కీలక భేటీ
సీట్ల కేటాయింపు.. టిడిపి-జనసేన-బిజెపి సమావేశం

అమరావతి (CLiC2NEWS): టిడిపి అధినేత చంద్రబాబు నివాసంలో జనసేన, బిజెపి నేతులు సోమవారం భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల ముఖ్యనేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్, బిజెపి జాతీయ నేత
జైజయంత్ పండా హాజరయ్యారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరుల పాల్గిన్నట్లు సమాచారం.
మూడు పార్టీల పొత్తు ఖరారైన అనంతరం సీట్ల కేటాయింపుపై చర్చించేందుకు పార్టీనేతలు చర్చల్లో పాల్గొన్నారు. పోత్తులో భాగంగా జనసేన, బిజెపికి 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలు కేటాయించటం జరిగింది.