రాబోయే ఐదైళ్లూ బిజెపి, టిడిపి కలిసి పనిచేస్తాయి: ప్రధాని మోడీ

ఢిల్లీ (CLiC2NEWS): ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తెలుగుదేశం పార్టి ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ.. రాబోయే ఐదైళ్లూ రాష్ట్రంలో, కేంద్రంలో రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయన్నారు. నా మిత్రుడు చంద్రబాబు నేతృత్వంలో దేశ, రాష్ట్ర అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామన్నారు. ప్రధానమంత్రిని కలిసిన వారిలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్ర శేఖర్, ఎంపిలు మాగుంట శ్రీనివాస రెడ్డి, లావు శ్రీకృష్టదేవరాయలు , కలిశెట్టి అప్పలనాయుడు, బైరెడ్డి శబరి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.