టిడిపి ఎంపిలతో చంద్రబాబు భేటీ

అమరావతి (CLiC2NEWS): ఎన్నికల్లో గెలుపొందిన టిడిపి ఎంపిలు పార్టి అధినేత చంద్రబాబు నివాసంలో సమావేశామయ్యారు. అందుబాటులో లేని వారు జూమ్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా చంద్రబాబు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో విహరించొద్దని, బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలే మనందరి ప్రథమ కర్తవ్యమని .. దీనికి తగ్గట్టుగా పార్లమెంట్‌లో కృషి చేయాలన్నారు. వ్యవస్తలకు అతీతంగా ఎవరు వ్యవహరించినా, ఆ వ్యవస్థే తిరిగి కాటేస్తుందని గుర్తించాలన్నారు. పదవులు శాశ్వతం అనుకోవద్దన్నారు. మరోవైపు పార్టి ఎంపీలతో శుక్రవారం ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాల సమావేశానికి చంద్రాబాబు హాజరుకానున్నట్లు సమాచారం.