గోవా గవర్నర్‌గా టిడిపి సీనియర్ నేత అశోక్ గజపతిరాజు
విజయనగరం (CLiC2NEWS): గోవా గరవ్ర్నర్‌గా టిడిపి సీనియర్ నేత , మాజి కేంద్ర మంత్రి పూసపాటి అశోక్‌గజపతి రాజు నియమితులయ్యారు. గోవాతో పాటు రెండు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. హరియాణా గవర్నర్ గా పనిచేసిన బండారు దత్తాత్రేయ పదవీకాలం ముగియటంతో ప్రొఫెసర్ ఆషిమ్ కుమార్ ఘోష్ నియమితులయ్యారు. లద్దాఖ్ గవర్నర్‌గా కవీందర్ గుప్తాను రాష్ట్రపతి నియమించారు.
గోవా గవర్నర్‌గా తన పేరును సిఎం చంద్రబాబు సిఫార్సు చేయడం ఆనందంగా ఉందని ఆశోక్ గజపతి రాజు అన్నారు. ఈ నియామకంతో తెలుగావారి గౌరవాన్ని మరింత పెంచే బాధ్యత తనపై ఉందని ఈ సందర్భంగా తెలిపారు. గోవా అంటే ప్రియ మిత్రుడు మనోహర్ పారికర్ గుర్తొస్తారని.. కోరుకొండ సైనిక్ స్కూల్‌లో అమ్మాయిలకూ చదివే అవకాశం కల్పించాలని ఆయన రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు కోరానని తెలిపారు. దేశానికి మరోసారి సేవ చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉందని.. అభినందనలు తెలుపుతున్న ప్రతి ఒక్కరీకీ అశోగజపతి రాజు ధన్యవాదాలు తెలియజేశారు.