బిజెపి, జన‌సేన పొత్తుతో ఎన్నిక‌ల బ‌రిలోకి.. చంద్ర‌బాబు

ఢిల్లీ (CLiC2NEWS): కేంద్ర హోంమంత్రి అమిషాతో టిడిపి అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేనాని ప‌వ‌న్‌కాల్యాణో భేటీ అయ్యారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ అమిత్‌షా నివాసంలో శ‌నివారం స‌మావేశామ‌య్యారు. సీట్ల స‌ర్దుబాటుపై చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. స‌మావేశ‌నాంత‌రం చంద్ర‌బాబు టెలీకాన్ప‌రెన్స్ నిర్వ‌హించారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే పొత్తులు పెట్టుకున్నామ‌ని.. బిజెపి, జ‌న‌సేన పొత్తుతో ఎన్నిక‌ల‌కు వెళ్తున్నామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఐదేళ్ల‌లో జ‌గ‌న్ రాష్ట్రాన్ని దివాళా తీయించార‌ని.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్ర స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌ని చంద్ర‌బాబు అన్నారు. ఆర్ధిక విధ్యంసం నుండి కోలుకోవ‌డానికి కేంద్రంతో క‌లిసి ఉండాల‌న్నారు. పొత్తులో భాగంగా ఎవ‌రికైనా సీటు రాకుంటే నిరుత్సాహ‌ప‌డొద్ద‌ని.. సీనియ‌ర్లు బాధ్య‌త తీసుకొని పొత్తు అవ‌స‌రాన్ని నేత‌ల‌కు వివ‌రించాల‌ని తెలిపారు. సీట్ల స‌ర్దుబాటుపై చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని.. పోటీ చేసే స్థానాల‌పై మ‌రో స‌మావేశం త‌ర్వాత నిర్వ‌ణ‌యం ఉంటుంద‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.