ఆర్మీ పబ్లిక్ పాఠశాలల్లో టీచర్ పోస్టులు

ఆర్మీ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటి ప్రకటన విడుదల చేసింది. కంటోన్మెంట్, మలిటరి స్టేషన్‌లో మొత్తం 139 ఆర్మీ పబ్లిక్ స్కూళ్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సికిందరాబాద్ (ఆర్‌కెపి) , సికిందరాబాద్ (బొల్లారం), గొల్కొండలలో ఆర్మీ పబ్లిక్ స్కూళ్లు ఉన్నాయి. బయాలజి, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లిష్, జాగ్రఫి, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైకాలజి , సంస్కృతం , ఫిజికల్ ఎడ్యుకేషన్‌లలో ఉపాధ్యాయ నియమకం జరుగుతుంది.ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెన్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం , ధ్రువపత్రాల పరిశీలన , వైద్యపరీక్షల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు రుసుం రూ.385గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఈ నెల 25లోపు పంపించాల్సి ఉంది. నవంబర్ 23,24 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు మూడు పరీక్ష కేంద్రాలను ఎంచుకోవచ్చు.
1. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పిజిటి) పోస్ట్ గ్రాడ్యుయేషన్ , బిఇడి 50% మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థుల వయస్సు 40 ఏళ్ల లోపు ఉండాలి. అనుభవం ఉన్న వారికి 57 ఏళ్ల లోపు ఉండాలి.
2. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టిజిటి) గ్రాడ్యుయేషన్, బిఇడి 50% శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
3. ప్రైమరి టీచర్ (పిఆర్‌టి).. గ్రాడ్యుయేషన్, రెండేళ్ల డిఇఐఇడి/ బిఇఐఇడి 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా బిఇడి , ఆరు నెలల పిడిపి ఇటి/ బ్రిడ్జ్ కోర్సు 50% మార్కులతో పూర్తి చేయాలి. పూర్తి వివరాలకు
http:// www. awesinida.com/ వెబ్‌సైట్ చూడగలరు.