ఈస్ట్ కోస్ట్ రైల్వేలో టీచ‌ర్ పోస్టులు

ఈస్ట్ కోస్ట్ రైల్వే, ఒడిశా.. 22 టీచ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఈ ఉద్యోగాల‌కు ఎంపిక జ‌రుగుతుంది. ఆసక్తి , అర్హ‌త క‌లిగిన వారు ఈ నెల 30వ తేదీ లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

పోస్టుల వివ‌రాలు

పిజిటి -3
ఈ పోస్టుకు ఎంపికైన వారికి నెల‌కు వేత‌నం రూ. 27,500 అందుతుంది.

టిజిటి -14, లైబ్రేరియ‌న్ -1, పిఇటి-1
ఈ మూడు పోస్టుల వారికి నెల‌కు వేత‌నం రూ. 26,500 గా నిర్ణ‌యించారు.

ఆర్ట్ & క్రాప్ట్ -1, పిఎన్‌టి -1, బాల‌వాటిక టీచ‌ర్-1

ఈ మూడు పోస్టుల‌కు నెల‌కు వేత‌నం రూ. 21,500 చెల్లిస్తారు.

పోస్టును అనుస‌రించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, బిఇడి, డిప్లొమా, ఎంఎ, ఎంఎస్‌సి, బిఇఎల్ ఇడి, డిఇఎల్ఇడి, ఇంట‌ర్‌,. పిబిఇడి, బిఎల్ ఐబి ఉత్తీర్ణులై ఉండాలి. ప‌ని అనుభ‌వం ఉండాలి.

అభ్య‌ర్థుల వ‌య‌స్సు 9-5-2025 నాటికి 18 నుండి 65 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
అభ్య‌ర్థులను ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జూన్ 3,4,5 తేదీల్లో ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తారు.

వేదిక‌:
మిక్స్‌డ్ హ‌య్య‌ర్ సెకండ‌రీ స్కూల్, జ‌ట్ని (రైల్వే స్టేష‌న్ ద‌గ్గ‌ర‌) , ఖుర్దా రోడ్ ఒడిశా. (ఉద‌యం 8.30 నుండి 10.00 వ‌ర‌కు ) ఉంటుంది.

 

Leave A Reply

Your email address will not be published.