CPS: ఎపిలో కొనసాగుతున్న ఉపాధ్యాయ దీక్షలు ..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో సిపిఎస్ రద్దు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు దీక్షలు చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ రద్దు చేయాలంటూ యుటిఎఫ్ ఆధ్వార్యంలో సంకల్ప దీక్షలు చేపట్టారు. కడప, మన్యం, విజవాడ, నెల్లూరు జిల్లాలలో యుటిఎఫ్ ఆధ్వర్వంలో ఉపాధ్యాయులు సంకల్ప దీక్షలు చేపట్టారు. వీరంతా సిపిఎస్ రద్దు చేస్తారా.. లేదా అనే విషయం సిఎం స్వయంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. సిపిఎస్ బదులు జిపిఎస్ తీసుకురావడం అంగీకార యోగ్యం కాదని.. 3వ తేదీన గన్నవరంలో సంకల్పదీక్ష తలపెడితే అనుమతించక అక్రమంగా అరెస్టులు చేశారని ఆరోపించారు. ఐదో తేదీ వచ్చినా.. ఇంకా ప్రభుత్వం జీతాలు వేయలేదన్నారు.