బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా విడుదల
![](https://clic2news.com/wp-content/uploads/2020/08/bjp-flag-3818-750x430.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో శాసన సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. తొలి విడతగా 52 మందితో అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. ఈ జాబితాలో కరీంనగర్ నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్ పోటీ చేయనున్నారు. అలాగే హుజూరాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి ఈటల రాజేందర్ పోటీలో నిలవనున్నారు.