10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై టీమిండియా విజయం
మొదట బౌలర్లు.. ఆ తర్వాత బ్యాటర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరిస్‌లో తొలి మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ 25.2 ఓవర్లలో 110 పరుగులకు కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్ (6/19)వేశాడు. షమీ (3/31) కూడా చక్కటి బౌలింగ్‌వేసి ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేశాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 18.4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (78*), శిఖర్ ధావన్ (31*) ధాటిగా ఆడి టీమిండియాని గెలిపించారు.
అదరగొట్టని బుమ్రా..
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్లను హడలెత్తించిన బుమ్రా ఒకే మ్యాచ్‌లో 6 వికెట్లు తీయడం కెరీర్‌లో ఇదే తొలిసారి. వరుసగా వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను కోలుకోకుండా దెబ్బతీశాడు.