ఫైనల్‌కు భారత్..
ఇంగ్లాండ్‌పై టీమ్ ఇండియా విజయం

T20 World Cup: టి20 వరల్డ్‌కప్ లో భాగంగా ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లు రోహిత్ శర్మ 57, సూర్యకుమార్ 47 పరుగులతో రాణించారు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 103 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్ పోరులో శనివారం దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది.
2022 టి20 పెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో రోహిత్ సేన ఘోర పరాభవాన్ని చవిచూసింది. 168 పరుగులు చేసిన భారత్‌ను కేవలం 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి టీమ్ ఇండియాకు ఓటమిని మిగిల్చింది.
ఇపుడు మళ్లీ 2024 సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్‌తో తలపడిన భారత్.. రెండేళ్ల కిందటి ప్రతీకారం తీర్చుకుంది. టైటిల్ కోసం రోహిత్ సేన ఫైనల్‌కు దూసుకెళ్లింది.