రెండో టి-20లో టీమ్ ఇండియా గ్రాండ్ విక్టరీ
![](https://clic2news.com/wp-content/uploads/2022/07/team-india.jpg)
బర్మింగ్ హోమ్ (CLiC2NEWS): రెండో టి-20లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 171 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లాండ్ 121 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 49 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమ్ ఇండియా 2-0 తేడాతో సొంతం చేసుకుంది. ఇక ఆదివారం మూడో మ్యాచ్ జరుగనుంది.
ఇంగ్లాండ్ టీమ్‌లో మెయిన్ అలీ -35, డేవిడ్ విల్లే -33 టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఈ మ్యాచ్‌లో భారత్ బౌలర్లు ఆదినుంచి కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. దీంతో ఇంగ్లాండ్ బ్యాటర్లను తక్కువ స్కోర్‌కే అవుట్ చేసి పై చేయి సాధించారు. భువనేశ్వర్ కుమార్ 3/15, బుమ్రా 2/10 తో రాణించారు. అలాగే చాహల్ 2/10తో రాణించారు.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన టిమ్ ఇండియా టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసింది. రవీంద్ర జడేజా 46 అత్యధిక స్కోరు చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా జడేజా పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో టీమ్ ఇండియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగు చేసింది.