IND vs NZ: రెండో వ‌న్డేలో టీమ్ ఇండియా ఘ‌న‌ విజ‌యం..

రాయ్‌పుర్ (CLiC2NEWS): భార‌త్‌, న్యూజిలాండ్ మ‌ధ్య జ‌రిగిన రెండ‌వ వ‌న్డేలో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. భార‌త్ 109 ప‌రుగుల ల‌క్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. కేవ‌లం రెండు వికెట్లు కోల్పోయి 20.1 ఓవ‌ర్లలో కివీస్‌పై 8 వికెట్ల తేడాతో విజ‌యం సొంతం చేసుకుంది. ఈ విజ‌యంతో మూడు వ‌న్డేల సిరీస్‌ని భార‌త్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నామ‌మాత్ర‌పు మూడ‌వ వ‌న్డే మ్యాచ్ మంగ‌ళ‌వారం జర‌గ‌నుంది. మ‌హ‌మ్మ‌ద్ ష‌మి ప్లేయ‌ర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు అందుకున్నాడు. విరాట్ కోహ్లీ 11, రోహిత్ శ‌ర్మ 51, గిల్ 40*, ఇషాన్ కిష‌న్ 8* ప‌రుగులు చేశారు.
ముందుగా టాస్ గెలిచి భార‌త్ బౌలింగ్‌ని ఎంచుకుంది. భార‌త బౌల‌ర్ల దాటికి కివీస్ 34.3 ఓవ‌ర్ల‌లో 108 ప‌రుగులు చేసింది.

Leave A Reply

Your email address will not be published.