వీర జవాన్‌కు కన్నీటి వీడ్కోలు

చిత్తూరు(CLiC2NEWS): సాయితేజ అంత్యక్రియలు చిత్తూరు జిల్లాలోని ఎగువరేగడలో కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించారు. తమిళనాడు ఆర్మీ హెలికాప్టర్ ఘటనలో మృతి చెందిన చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. ఈరోజు బెంగళూరు నుండి సాయితేజ భౌతికకాయాన్ని ఎగువరేగడకు తీసుకువచ్చారు. సుమారు 30కి.మీ. దారి పొడవునా పెద్ద ఎత్తున ప్రజలు ర్యాలీగా వచ్చారు. అనంతరం సాయితేజ వ్యవసాయ క్షేత్రంలో ఉంచిన భౌతిక కాయాన్ని సందర్శించేందుకు చుట్టుపక్కల ప్రజలు భారీగా తరలివచ్చారు. ‘సాయితేజ అమర్ రహే’ అంటూ ప్రజలు నినాదం చేశారు. సైనికులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం చేశారు.