ఇసిఐఎల్‌లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
హైదరాబాద్ : నగరంలొని అటామిక్ ఎనర్జి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. 7 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు కలవు.
విద్యార్హతలు , ఉద్యోగానుభవం , ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
ప్రాజెక్ట్ ఇంజినీర్-1
ఈ పోస్టుకు అభ్యర్థుల వయస్సు 33 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు వేతనం 40వేలు అందుతుంది. రెండో ఏడాది రూ.45వేలు.. మూడో ఏడాది రూ.50వేలు.. నాలుగో ఏడాది రూ.55 వేలు ఉంటుంది.
టెక్నికల్ ఆఫీసర్ -3
ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థలు వయస్సు 30 ఏళ్లకు మించకూడదు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం రూ. 25వేలు.. రెండో ఏడాది రూ. 28 వేలు.. మూడో ఏడాది రూ.31వేలు అందుతుంది.
అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్-3
అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు. నెలకు వేతనం రూ. 24, 800 ఉంటుంది.
60% మార్కులతో సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బిఇ/ బిటెక్ తో పాటు ఉద్యోగానుభవం తప్పనిసరిగా ఉండాలి
ఇంటర్వ్యూ తేది 26.03.2025గా నిర్ణయించారు.
చిరునామా : కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ , నలంద కాంప్లెక్స్, ఎలక్ట్రినిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, టిఐఎఫ్ ఆర్ రోడ్, ఇసిఐఎల్ పోస్ట్, హైదరాబాద్