AVNL: హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ, చెన్నైలో టెక్నీషియన్ల పోస్టులు

AVNL: ఆర్మడ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్‌కు చెందిన చెన్నై, ఆవడిలోని హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో ఫిక్స్డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన డిజైన్ ఇంజినీర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టులు 6.. సీనియర్ డిజైన్ ఇంజినీర్ 2, డిజైన్ ఇంజినీర్ 4 పోస్టులు కలవు. ఇంజినీరింగ్ డిగ్రీ (ఎలక్ట్రికల్/ మెకానికల్)తో పాటు పని అనభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. నెలకు సీనియర్ డిజైన్ ఇంజినీర్ పోస్టుకు రూ. 60వేలు.. డిజైన్ ఇంజినీర్‌కు రూ. 50వేలు ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 45 ఏళ్లు మించకూడదు. దరఖాస్తులను అక్టోబర్ 12వ తేదీ లోపు పంపిచాల్సి ఉంది. దరఖాస్తులను ది చీఫ్ జనరల్ మేనేజర్, హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ , అవడి, చెన్నై చిరునామాకు పంపించాలి. పూర్తి వివరాలకు https://avnl.co.in/ వెబ్సైట్ చూడగలరు.