ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో టెక్నీషియన్ పోస్టులు
ఫిక్స్డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన రక్షణ శాఖ పరిధిలోని ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ కు చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో పోస్టులు భర్తీ చేయనున్నారు. . మెకానికల్, ప్రొడక్షన్, క్వాలిటి, ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ మేనేజ్ మెంట్ , ఎలక్ట్రిలక్, మెటలర్జి, టూల్ డిజైన్, క్వాలిటి అండ్ ఇన్స్పెక్షన్, హెచ్ ఆర్, స్టోర్స్ విభాగాల్లో మొత్తం 86 పోస్టులు కలవు. పని అనుభవం, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక .జరుగుతుంది.
జూనియర్ మేనేజర్ ..50 పోస్టులు
డిప్లొమా టెక్నీషియన్ -21 పోస్టులు
అసిస్టెంట్ – 11 పోస్టులు
జూనియన్ అసిస్టెంట్ -4 పోస్టులు
అర్హత అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో డిప్లొమా , డిగ్రీ ( బిఎ/ బిఎస్సి/ బికామ్) బిఇ/ బిటెక్ , పిజి (ఎంఎ/ ఎమ్ ఎస్ సి/ ఎంకామ్/ ఎంబిఎ) తో పాటు పని అని అనుభవం ఉండాలి.
వయస్సు అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లకు మించకూడదు. ఎస్సి / ఎస్ టిలకు ఐదేళ్లు, ఓబిసిలకు మూడేళ్లు పిడబ్ల్యుబిడిలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు రూ. 300గా నిర్ణయించారు. ఎస్సి / ఎస్ టి ,పిడబ్ల్యుబిడి, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళలకు ఫీజు మినహాయించారు. దరఖాస్తులను ప్రకటన వెలువడిన తేదీ (11.11.2024) నుండి 21 రోజుల్లో పంపించాలి. పూర్తి వివరాలకు https://avnl.co.in/ వెబ్సైట్ చూడగలరు