టెన్త్, ఐటిఐ అర్హతతో ఎన్ఆర్ఎస్సిలో టెక్నీషియన్ పోస్టులు
![](https://clic2news.com/wp-content/uploads/2023/12/JOBS-IN-NRSC.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. పదోతరగతి, ఐటిఐ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. పలు విభాగాల్లో మొత్తం 54 పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 21,700 నుండి రూ. 69,100 దరకు చెల్లిస్తారు. ఈనెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎపిలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి.. తెలంగాణలో హైదరాబాద్ కరీంనగర్‌లలో పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి.
టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్, మెకానిక్) 33 పోస్టులు, ఎలక్ట్రికల్‌లో 8, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 9, ఫొటోగ్రఫి, డిటిపి, ఆపరేటర్ రెండు పోస్టుల చొప్పన ఉన్నాయి. ఈ పోస్టులను తాత్కాలిక పద్ధతిలో ఎంపిక చేస్తారు. కానీ కొనసాగించే అవకాశాలు కూడా ఉంటాయి.
అభ్యర్థుల వయస్సు డిసెంబర్ 31 నాటికి 18 నుండి 35 ఏళ్ల వయస్సు ఉండాలి. ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు ఐదేళ్లు, ఒబిసిలకు మూడేళ్ల సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100, ప్రాసెసింగ్ ఫీజు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం రాత పరీక్షకు హాజరైన తర్వాత రిఫండ్ చేస్తారు. పూర్తి సమాచారం కొరకు https://www.nrsc.gov.in/వెబ్సైట్ చూడగలరు.