Telangana: ప్రైవేట్ దవాఖానలకు టీకాల నిలిపివేత

హైదరాబాద్(CLiC2NEWS): ప్రైవేట్ దవాఖానలకు టీకాల పంపిణీ నిలిపివేస్తూ శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటుకు వెంటనే టీకా డోసుల పంపిణీ నిలిపివేయాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు డీఎంహెచ్ఓలకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న డోసులను వినియోగించుకోవచ్చని, మిగిలిన టీకాలను వెంటనే సేకరించాలని సీసీపీ వైద్యాధికారులను డీహెచ్ ఆదేశించారు. మిగతా టీకాలను వెంటనే సేకరించాలని హెల్త్ డైరెక్టర్ ఆదేశించారు. కాగా, జనవరి 25వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ జరుగుతుంది. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ జరుగుతుండగా. రేపటి (మే 1వ తేదీ) నుంచి 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇస్తామని సీఎం ప్రకటించిన విషయం తెలిసింది.