రేపు తెలంగాణ పదో తరగతి ఫలితాలు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాలను రేపు (బుధవారం) మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను హైదరాబాద్‌లో రాష్ట్ర విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇవాళ అధికారులు వెల్లడించారు. గత నెల (ఏప్రిల్) 3 వ తేదీ నుంచి 13 వ తేదీ వరకు పదోతరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలను రాష్ట్రం లో మొత్తం 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యరు.