TSPSC: రాష్ట్రంలోని మున్సిపల్ శాఖలో 175 పోస్టులకు నోటిఫికేషన్
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్‌లు విడుదలవుతున్నాయి. మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పోస్టుల భర్తికి టిఎస్‌పి ఎస్‌సి నోటిఫికేషన్ విడుదలచేసింది. ఈ పోస్టులకు సెప్టెంబర్ 20వ తేదీనుండి దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 13వ తేదీ వరకు గడువుంది. రాష్ట్రంలోని మహిళ, శిశు సంక్షేమ శాఖలోని 23 పోస్టులకు కూడా నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు గడువు అక్టోబర్ 10 వరకు ఉంది.