Telangana Election Results: Minute to Minute

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023 (119/119) |
|||
Party | Lead | Won | |
BRS | ![]() |
2 | 37 |
---|---|---|---|
Congress | ![]() |
0 | 64 |
BJP | ![]() |
0 | 8 |
AIMIM | ![]() |
0 | 7 |
Others | 0 | 1 |
లైవ్ బ్లాగ్…
తెలంగాణ నూతన డిజిపిగా రవిగుప్తా నియామకం..
హైదరాబాద్ నూతన డిజపిగా రవిగుప్తా నియమితులయ్యారు. ఎన్నికల నియమావళిని అతిక్రమించి నందుకు గాను కేంద్ర ఎన్నికల సంఘం డిజిపి అంజనీకుమార్ ని సస్సెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో రవిగుప్తాని నూతన డిజిపిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
- కరీంనగర్‌లో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ ఓటమి
బిఆర్ ఎస్ అభ్యర్థి గంగుల కమాలాకర్ 3,284 ఓట్ల మెజారిటీతో గెలుపు.. రెండు ఇవిఎంలు పనిచేయకపోవడంతో 1300 ఓట్లు అధికారులు లెక్కించలేదు. దీంతో కరీంనగర్ నియోజకవర్గంలో బిజెపి రీకౌంటిగ్ కోరుతుంది.
- గజ్వేల్‌లో సిఎం కెసిఆర్ గెలుపు..
గజ్వేల్ నియోజక వర్గంలో సిఎం కెసిఆర్ విజయం సాధించారు. కామారెడ్డిలో బిజెపి అభ్యర్థి కెసిఆర్‌పై గెలుపొందారు.
- తెలంగాణ డిజిపి అంజనీకుమార్ ని కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది.
మరో ఇద్దరు అదనపు డిజిలు సందీప్ కుమార్ జైన్, మహేశ్ భగవత్ కు నోటీసులు జారీ చేశారు.
- ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పదవికి రాజీనామా..
కెసిఆర్ రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు.
- కామారెడ్డిలో బిజెపి అభ్యర్థి గెలుపు
కామారెడ్డిలో బిజెపి అభ్యర్థి వెంకట రమణారెడ్డి 5,156 ఓట్ల మెజారిటీతో కెసిఆర్ పై విజయం సాధించారు.
కామారెడ్డి, గజ్వేల్ .. రెండు స్థానాల్లోనూ ముఖ్యమంత్రి కెసిఆర్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. కామారెడ్డిలో బిజెపి అభ్యర్థి వెంకట రమణారెడ్డి , సిఎం కెసిఆర్, రేవంత్ రెడ్డిపై విజయం సాధించారు. 4,273 ఓట్ల మెజారిటీతో గెలుపు సొంతం చేసుకున్నారు.
- మంత్రి మల్లారెడ్డి విజయం
మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బిఆర్ ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి విజయం సాధించారు.
- భట్టి విజయం
మధిరలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక్కడ నుంచి పోటీ చేసిన సీఎల్సీ నేత భట్టి వివ్రమార్క విజయం సాధించారు.
- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గెలుపు
నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయం సాధించారు.
- నర్సంపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి, మహబూబాబాద్ నుంచి మురళీ నాయక్ గెలుపొందారు.
- బోధన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి విజయం
- పెద్దపెల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి విజయరామణారావు విజయం
- బోథ్‌లో బిఆర్ ఎస్ అభ్యర్థి అనిల్ యాదవ్ విజయం..
బోథ్ నియోజక వర్గం నుండి బిఆర్ ఎస్ అభ్యర్థి అనిల్ యాదవ్.. కాంగ్రెస్ అభ్యర్థి ఆడే గజేందర్ , బిజెపి అభ్యర్థి సోయం బాపురావుపై గెలుపొందారు.
- బాల్కొండలో బిఆర్ ఎస్ అభ్యర్థి , మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గెలుపు
కొడంగల్‌కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా..: రేవంత్‌రెడ్డి
“ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.
కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటా.
ఈ గడ్డ పై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే బాధ్యత తీసుకుంటా. దేశానికి కొడంగల్ ను ఒక మోడల్ గా నిలబెడతా.“
-అని రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.
ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.
కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటా.
ఈ గడ్డ పై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే… pic.twitter.com/v9hcZ4VpB3
— Revanth Reddy (@revanth_anumula) December 3, 2023
- ఫలితాలపై మంత్రి కెటిఆర్ స్పందన…
భిఆర్ ఎస్ కు వరుసగా రెండు సార్లు అధికారాన్ని అందించినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు ఫలితం గురించి బాధలేదని పేర్కొన్నారు. కానీ ఈ ఫలితం మాకు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఖచ్చితంగా నిరాశ చెందానని పేర్కొన్నారు. ఈ ఫలితాలన్ని మేమొక పాఠంగా తీసుకొని, తిరిగి పుంజుకుంటాం. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు మంత్రి కెటిఆర్. వారికి శుభం జరగాలి అని కోరారు.
-
రాజాసింగ్ గెలుపు
గోషామహల్‌లో బీజేపి అభ్యర్థి గెలుపొందారు. పాతబస్తీ గోషామహల్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి రాజాసింగ్ గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి, బిఆర్ ఎస్ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ పై విజయం సాధించారు.
- సిరిసిల్లలో మంత్రి కెటిఆర్ విజయం
సిరిసిల్ల నియోజకవర్గంలో బిఆర్ ఎస్ గెలుపొందింది. ఇక్క డి నుంచి బిఆర్ ఎస్ అభ్యర్థి మంత్రి కెటిఆర్ విజయం సాధించారు.
-
నాగర్ కర్నూరల్‌లో కూచకుళ్ల విజయం
నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి విజయం సాధించారు.
- పాలేరులో పొంగులేటి గెలుపు
పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు.
- మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి విజయం
మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు.
- దేవరకొండ నుంచి బాలు నాయక్ విజయం
దేవరకొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బాలు నాయక్ విజయం సాధించారు.
- సికింద్రాబాద్‌లో పద్మారావు విజయం
సికింద్రాబాద్ నియోజకవర్గంలో బిఆర్ ఎస్ అభ్యర్థి టి పద్మారావు విజయం సాధించారు.
- నార్సాపూర్‌లో సునీతా లక్ష్మారెడ్డి విజయం సాధించారు.
- సనత్ నగర్ నుంచి తలసాని విజయం
సనత్ నగర్ నియోజకవర్గం నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయం సాధించారు.
- మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు.
- నిజామాబాద్ అర్భన్ లో బిజెపి అభ్యర్థి ధన్ పాల్ సూర్యానారాయణ విజయం
- కంటోన్మెంట్‌లో బిఆర్ ఎస్ అభ్యర్థి లాస్య విజయం
కంటోన్మెంట్ నియోజకవర్గంలో బిఆర్ ఎస్ అభ్యర్థి లాస్య నందిత విజయం సాధించారు.
-
పాలకుర్తి, నారాయణ ఖేడ్‌లో కాంగ్రెస్ విజయం
పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి విజయం సాధించారు.
నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి పి. సంజీవ రెడ్డి విజయం సాధించారు.
- ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క విజయం సాధించారు.
వర్ధన్నపేట నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కె. ఆర్ నాగరాజు గెలుపొందారు.
-
నకిరేకల్, నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు
నకిరేకల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం గెలుపొందారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కె. జయవీ ర్‌రెడ్డి విజయం సాధించారు.
- ఆలేరు, నిజామాబాద్ రూరల్ లో కాంగ్రెస్ గెలుపు
ఆలేరులో కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య గెలుపొందారు.
నిజామాబాద్ రూరల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి భూపతి రెడ్డి విజయం సాధించారు.
- వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు
వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ గెలుపొందారు.
-
కుత్బుల్లాపూర్‌లో బిఆర్ ఎస్ అభ్యర్థి వివేకానంద విజయం
కుత్బుల్లాపూర్‌లో బిఆర్ ఎస్ అభ్యర్థి 85 వేల భారీ మెజార్టీతో విజయం సాధించారు.
- మంథనిలో శ్రీధర్‌బాబు విజయం
మంథని నియోజకవర్గంలో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, బిఆర్ ఎస్ అభ్యర్థి పుట్టమధుపై శ్రీధర్ బాబు గెలుపొందారు.
మెదక్‌లో మైనంపల్లి రోహిత్ విజయం సాధించారు.
-
మెదక్‌లో కాంగ్రెస్ గెలుపు
మెదక్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, బిఆర్ ఎస్ అభ్యర్థి పద్మాదేవందర్‌రెడ్డిపై గెలుపొందారు.
-
బాన్సువాడ, భద్రాచలంలో బిఆర్ ఎస్ గెలుపు
- బాన్సువాడ, భద్రాచలంలో బిఆర్ ఎస్ గెలుపు.
బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి,
భద్రాచలంలో తెల్లం వెంకట్రావు గెలపు
- కల్వకుర్తి కాంగ్రెస్ దే
కల్వకుర్తిలో కాంగ్రెస్ గెలపొందింది.. బిఆర్ ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి గెలుపొందారు.
- కోడంగల్‌లో రేవంత్ ఘన విజయం
కోడంగల్‌లో తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బిఆర్ ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డిపై గెలుపొందారు. 31,849 ఓట్లతో రేవంత్ విజయం సాధించారు.
-
అంబర్‌పేటలో బిఆర్ ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ విజయం
అంబర్‌పేటలో బిఆర్ ఎస్ విజయం సాధించాంది. ఆ పార్టీకి చెందిన కాలేరు వెంకటేశ్ గెలుపొందారు.
-
హజూర్‌నగర్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి విజయం
హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ కుమార్‌రెడ్డి విజయం సాధించారు.
-
జుక్కల్‌లో బిఆర్ ఎస్ గెలుపు
జుక్కల్‌లో భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థి హన్మంత్ షిండే విజయం సాధించారు.
- మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఓటమి
నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటమి పాలయ్యారు. బిజెపి అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి నిర్మల్ నుంచి గెలుపొందారు.
-
దామోదర రాజనర్సింహ విజయం
అందోల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రాజనర్సింహ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి బిఆర్ ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్‌పై గెలుపొందారు.
- భారీ ర్యాలీగా గాంధీభవన్‌కు బయలు దేరిన రేవంత్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకు వెళ్తోంది. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కి పోలీసులు భద్రత పెంచారు. అలాగే ఆయన భారీ ర్యాలీగా గాంధీభవన్ కు భయలు దేరారు. భారీగా అభిమానుల మద్దతు మధ్య ఆయన ర్యాలీ కొనసాగుతోంది.
- దుబ్బాకలో బోణీ కొట్టిన బిఆర్ ఎస్
దుబ్బాకలో బిఆర్ ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.
-
బెల్లంపల్లిలో గడ్డం వినోద్ గెలుపు
కాంగ్రెస్ పార్టీ దూసుకువెళ్తోంది. బెల్లంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ గెలుపొందారు. సమీప ప్రత్యర్థి బిఆర్ ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యపై వినోద్ విజయం సాధించారు.
-
రామగుండంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు
రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ విజయం సాధించారు.
సమీప ప్రత్యర్థి బిఆర్ ఎస్ నాయకుడు కోరుకంటి చందర్‌పై మక్కాన్ సింగ్ విజయం సాధించారు.
- చార్మినార్‌లో ఎంఐఎం విజయం
చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి మీర్ జుల్ఫీకర్ అలీ గెలుపొందారు. ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి మేఘా రాణి అగర్వాల్‌పై అలీ గెలుపొందారు.
- ఇల్లెందులో కాంగ్రెస్ విజయం
కాంగ్రెస్ పార్టీ రెండో విజయాన్ని నమోదు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు (ఎస్టీ) నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనరయ్య తన ప్రత్యర్థి బిఆర్ ఎస్ అభ్యర్థి బానోతు హరిప్రియ నాయక్‌పై గెలుపొందు.
- బోణీ కొట్టిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో దూసుకు వెళ్తోంది. అశ్వరావుపేట అభ్యర్థి ఆది నారాయణరావు విజయం సాధించాడు.
బిఆర్ ఎస్ అభ్యర్థి మెచ్చా నాగాశ్వరరావు పై ఆదినారాయణరావు విజయం సాధించారు.
- పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ లీడ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింప ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్, సర్వీస్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ముందంజలో ఉంది.
- పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ లీడ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింప ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్, సర్వీస్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ముందంజలో ఉంది.
[…] Telangana Election Results: Minute to Minute […]