తెలంగాణలో మోగిన నగారా
నవంబరు 30న ఎన్నికలు.. షెడ్యూలు విడుదల చేసిన ఇసి

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంతోపాటు మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. దీంతో తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో శాసనసభకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్రం సోమవారం విడుదల చేసింది. ఈ ఐదు రాష్ట్రాల్లోన్ని 679 సెగ్మెంట్లలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
- మిజోరంలో నవంబరు 7న
- మధ్యప్రదేశ్‌లో నబంబరు 17న
- తెలంగాణలో నవంబరు 30 న ఒకే విడత పోలింగ్
- ఛత్తీస్‌గఢ్‌లో నవంబరు 7న తొలివిడత
నవంబర్ 17న రెండో విడదత పోలింగ్
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్
- నోటిఫికేషన్ నవంబరు 3
- నామినేషన్లకు ఆఖరు తేదీ.. నవంబరు 10
- నామినేషన్ల పరిశీలన నవంబరు 13
- ఉపసంహరణకు చివరి తేదీ.. నవంబరు 15
- పోలింగ్.. నవంబరు 30
- ఓట్ల లెక్కింపు డిసెంబరు 3వ తేదీ