రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలు..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవపు వేడుకల రాష్ట్రమంతటా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ గన్‌పార్క్ వద్ద అమర వీరులకు నివాళులర్పించారు. సచివాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి .. భద్రతా బలగాల నుండి గౌరవవందనం స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి రాజధాని వరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. జిల్లా కేంద్రాలలోని కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర మంత్రులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.