తెలంగాణ బిజెపి మేనిఫెస్టో..

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో శ‌నివారం బిజెపి మేనిఫ‌స్టోను విడుద‌ల చేసింది. స‌క‌ల జ‌నుల సౌభాగ్య తెలంగాణ పేరుతో మేనిఫెస్టోని కేంద్ర మంత్రి అమిత్‌షా ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ.. ఈ తొమ్మిదేండ్ల‌లో కేంద్రం రూ. 2.15 ల‌క్ష‌ల కోట్లు రాష్ట్రానికి ఇచ్చింద‌న్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒక‌టే ప్ర‌భుత్వాలు ఉంటే ప‌థ‌కాలు చ‌క్క‌గా అమ‌ల‌వుతాయన్నారు. గ‌తంలో వాజ్‌పేయీ ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, జార్ఖండ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల‌ను ఏర్పాటు చేసినా ఎటువంట వివాదాలు త‌లెత్త‌లేద‌ని, తెలంగాణ విష‌యంలో కాంగ్రెస్ స‌రిగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌న్నారు.

మేనిఫెస్టోలోని అంశాలు: 

ధ‌ర‌ణి స్థానంలో మీ భూమి యాప్

పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్ త‌గ్గింపు

బిఆర్ ఎస్ ప్ర‌భుత్వం కుంభ‌కోణాల‌పై విచార‌ణ‌కు క‌మిటి ఏర్పాటు

గ‌ల్ఫ్ బాధితుల కోసం ప్ర‌త్యేక నోడ‌ల్ విభాగం ఏర్పాటు

ప్ర‌భుత్వ ఉద్యోగులు, పెన్ష‌న‌ర్ల‌కు ప్ర‌తి నెలా 1న వేత‌నాలు, పింఛ‌న్లు

మ‌త రిజ‌ర్వేష‌న్లు తొల‌గించి, బిసి, ఎస్‌సి, ఎస్‌టిల‌కు పెంపు

ఉమ్మ‌డి పౌర‌స్మృతి ముసాయిదా క‌మిటీ ఏర్పాటు

అర్హ‌త క‌లిగిన కుటుంబాల‌కు కొత్త రేష‌న్ కార్డులు

ఎరువులు, విత్త‌నాల కొనుగోలు కోసం రూ. 2500 ఇన్‌పుట్ స‌బ్సిడి

పిఎం ఫ‌స‌ల్‌బీమా యోజ‌న కింద రైతుల‌కు ఉచిత పంట‌ల బీమా

వ‌రికి మ‌ద్ద‌తు ధ‌ర రూ,. 3,100

ప‌సుపు కోసం మార్కెట్ ఇంట‌ర్వెన్ష‌న్ ఫండ్ ఏర్పాటు

ఆస‌క్తి గ‌ల రైతుల‌కు ఉచితంగా దేశీ ఆవుల పంపిణీ.

నిజామాబాద్‌ను ట‌ర్మ‌రిక్ సిటీగా అభివృద్ది

Leave A Reply

Your email address will not be published.