రాష్ట్ర బడ్జెట్ 2024-25: ఆరు గ్యారంటీల‌కు పెద్ద‌పీట‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): 2024-25 ఆర్ధిక సంవ‌త్స‌రానికి రూ. 2,75,891 కోట్ల అంచనాల‌తో ఓటాన్ ఎకౌంట్ బ‌డ్జెట్‌ను అసెంబ్లీలో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ప్రేవేశ‌పెట్టారు. సామాజిక‌, ఆర్ధిక, రాజ‌కీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బ‌డ్జెట్‌ను ప్ర‌తిపాదించిన‌ట్లు ఆర్ధిక మంత్రి తెలిపారు. తెలంగాణ ప్ర‌జ‌లు స్వేచ్ఛ‌ను సాధించుకున్నారని, వారికి మ‌న‌స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. రెవెన్యూ వ్య‌యం రూ. 2,01,178 కోట్లు, మూల‌ధ‌న వ్య‌యం రూ. 29,669 కోట్లతో తొలి ప‌ద్దును ప్ర‌తిపాదించారు. బ‌డ్జెట్‌లో ఆరు గ్యారంటీల‌కు రూ. 53,196 కోట్లు, విద్యారంగానికి రూ. 21,389 కోట్లు కేటాయించారు.

Leave A Reply

Your email address will not be published.