రూ. 2,91,159 కోట్ల‌తో తెలంగాణ బ‌డ్జెట్‌..

శాస‌న స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన డిప్యూటీ సిఎం భ‌ట్టి

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర ప‌ద్దును రాష్ట్ర ఆర్థిక మంత్రి, డిప్యూటీ సిఎం భ‌ట్టి విక్ర‌మార్క అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టారు. రూ. 2,91,159 కోట్ల‌తో తెలంగాణ రాష్ట్ర ప‌ద్దును స‌భ ముందుకు తీసుకొస్తున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. దీంట్లో ముల‌ధ‌న వ్య‌యం 33, 487 కోట్లుగా చెప్పారు. ప‌న్ను ఆదాయం 1,38,181.26 కోట్లు, ప‌న్నేత‌ర ఆదాయం 35,208.44 కోట్లుగా పేర్కొన్నారు. కేంద్ర ప‌న్నుల్లో వాటా 26, 216.28 కోట్లు, కేంద్ర గ్రాంట్లు 21,636.15 కోట్లుగా పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 57,112 కోట్లు అప్పులు తీసుకోవాల‌ని మంత్రి స‌భ‌లో ప్ర‌తిపాదించారు. ఈ సంద‌ర్భంగా ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క బ‌డ్జెన్ ప్ర‌సంగం చేశారు.

Leave A Reply

Your email address will not be published.